టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. వీరయ్య చౌదరి ఒళ్లంతా కత్తులతో తూట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయన బాడీపై 53 కత్తిపొట్లు గుర్తించారు. ఒక్కో కత్తిపోటుకు రూ.2 లక్షలు ? నిందితుడు తీసుకున్నాడని అంటున్నారు. సూత్రధారులు, పాత్రధారుల మధ్య ఒక్కో కత్తిపోటుకు రూ.2 లక్షలు ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు.

అందుకే వీరయ్య ఒళ్లంతా జల్లెడ చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. వీరయ్య హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. వీరయ్యను చంపేందుకు 3 నెలల కిందటే నిందితుల ప్లాన్ వేశారని అంటున్నారు. హత్య జరిగి వారం రోజులు అవుతున్నా దొరకని నిందితులు.. పరారీలో ఉన్నారు.