వైఎస్ వివేకానంద వాచ్‌మెన్ డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టం

-

వైఎస్ వివేకానంద వాచ్‌మెన్ రంగయ్య మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు.ఈ క్రమంలోనే కడప నుంచి పులివెందులకు ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం, ఫోరెన్సిక్ టీమ్ వెళ్లినట్లు తెలిసింది.

ఎమ్మార్వో,వీఆర్వోల ఆధ్వర్యంలో సమాధిని తవ్వనున్నట్లు తెలుస్తోంది. పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రంగన్న బాడీకి రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. సిట్, రెవెన్యూ అధికారుల సమక్షంలో మరోసారి రీ పోస్టుమార్టం నిర్వహించడానికి ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వాచెమెన్ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news