ఏపీ స్కూల్స్, హాస్టల్స్ లో ఫైన్ రైస్ అందించ బోతున్నామని ప్రకటించారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఏలూరులోని నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా మహిళల పూర్తి భద్రతకి కూటమి ప్రభుత్వంలో వంద శాతం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లోనూ శిక్షణ పొందాలన్నారు. సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టింగ్ ల కోసం త్వరలో ప్రత్యేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టబోతున్నామని ప్రకటించారు. వాట్సాప్ ద్వారా రెండు వందల సేవలు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. మన జిల్లా, మన మండలం, మన ప్రాంతాల అభివృద్ధికి మహిళల తోడ్పాటు ఎంతో అవసరం అన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతి పాఠశాల, ప్రతి హాస్టల్లో ఫైన్ రైస్ అందించ బోతున్నామని… రాజకీయాల్లో మహిళలు మరింతగా ఎదగాలని కోరారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.