రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి హత్య కేసులో ట్విస్ట్.. ప్రముఖ బాబా అరెస్ట్

-

హైదరాబాద్ రియల్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి హత్య కేసులో పురోగతి లభించింది. ఈ కేసు లో కీలక నిందితుడు త్రిలోక్ నాధ్ బాబా పోలీసుల అదుపు లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేరళ లో అదుపు లోకి తీసుకున్న సైబరాబాద్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం… బాబాతో పాటు పోలీసుల అదుపులో మరో నిందితుడు కార్తిక్ ఉన్నట్లు తెలుస్తోంది.

భాస్కర్ రెడ్డి హత్య కు ముందు ఆహారంలో కార్తిక్ మత్తు మందు కలిపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఇక అటు రెండవ రోజు నలుగురు నిందితులు మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజు, ఆర్ఎంపి డాక్టర్ లను విచారిస్తునన్నారు పోలీసులు. అలాగే… ఈ కేసులో హైదరాబాద్ టూ శ్రీశైలం సీన్ రీ కన్స్టక్షన్ చేయనున్నారు పోలీసులు. సిసి పుటేజ్ , కాల్ సిడిఆర్ ఆధారంగా ఇతరుల పాత్రపై విచారణ చేపట్టనున్నారు. గుప్తనిధులు, రియల్ ఎస్టేట్ గొడవలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version