మన శరీరంలో 60 నుండి 75శాతం నీరే ఉంటుంది. నీరనేది ద్రవరూప పదార్థం. రెండు హైడ్రోజన్లు, ఒక ఆక్సిజన్ కలిసి నీటిగా మారాయి. నీటిని వేడిచేస్తే అది ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. సకల ప్రాణకోటి ఈ భూమ్మీద హాయిగా జీవిస్తున్నాయంటే దానికి కారణం నీరే. మరి అలాంటి నీరు మన శరీరానికీ చాలా అవసరం మన శరీరంలో ఉన్న నీటిశాతానికి 4శాతం తగ్గినా డీహైడ్రేషన్ కి దారి తీస్తుంది. 15శాతం తగ్గిందంటే అది అత్యంత తీవ్రమైన ప్రమాద హెచ్చరికగా పరిగణించవచ్చు.
నీరు ఎందుకు తాగాలి? నీరు తాగితే శరీరంలో ఏమవుతుందనే కొన్ని విషయాలని ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం ఎండాకాలం వచ్చింది కాబట్టి, నీటి ప్రాముఖ్యత ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
శరీర జీవక్రియ సరిగ్గా జరగడానికి
శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు అందకపోతే మెదడుకి ఆక్సిజన్ చేరదు. దానివల్ల కణజాలాలకి శక్తి అందదు. అప్పుడు అలసట మొదలగు ఇబ్బందులు వస్తుంటాయి. శరీరంలోని నీటిశాతం సరిగ్గా ఉంటేనే మూత్ర విసర్జన సక్రమంగా జరిగి ఎలాంటి సమస్య ఉండదు. లేదంతే మూత్రశయ సమస్యలు బాగా పెరుగుతుంటాయి.
లాలాజలం ఉత్పత్తి కావడానికి
కావాల్సినన్ని నీళ్ళు అందిస్తేనే లాలాజలం ఉత్పత్తి అవుతుంది. లేదంటే నోరు ఎండిపోయి అది మరో వినాశనానికి దారి తీయవచ్చు.
కీళ్ళనొప్పులని దూరం చేయడానికి, నీటిశాతం తక్కువగా ఉంటే, ఎముకలు బలహీనంగా మారతాయి.
శరీరంలో విష పదార్థాలను బయటకి పంపివేయడానికి నీళ్ళు తాగాల్సిందే. లేదంటే అది శరీరంలో ఉండిపోయి మూత్రాశయ ఇబ్బందులు, మూత్ర పిండాల్లో రాళ్ళకు కారణం అవుతుంది.
నీళ్ళు ఎక్కువగా తాగకపోయినా మలబద్దకం వస్తుంది. ఇప్పటికే మలబద్దకంతో ఇబ్బంది పడేవారు నీళ్ళు తక్కువ తాగుతున్నారేమో చెక్ చేసుకోండి. జీర్ణక్రియ సమస్యలు దూరం కావాలంటే నీళ్ళు ఎక్కువ తాగాలి.