రెబెల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తో మొదలైన మహారాష్ట్ర రాజకీయ కధ సూపర్ ట్విస్ట్ తో ముగిసింది. షిండే ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే వార్తలు మీడియాలో చూసిన షిండే వర్గం ఎమ్మెల్యేలు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైయ్యారు. గోవా హోటల్ లో ఉన్న రెబెల్ నేతలంతా ఈ వార్త విని ఏకంగా టేబుల్ పైకి ఎక్కి డాన్సులు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
“ఏక్నాథ్ షిండే మీకు ఎదురు లేదు.. మేమంతా మీ వెంటే ఉంటాం” అంటూ నినాదాలు చేస్తూ.. షిండేనే మహారాష్ట్ర సీఎం అనే వార్తలను టీవీ తెరపై చూస్తూ డ్యాన్సులు చేశారు. అయితే అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7: 30 నిమిషాలకు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోసియారే రాజ్ భవన్ లో వీరిద్దరితో ప్రమాణం చేయించారు.
#eknathshinde MLA celebrating unseen #Hindutva pic.twitter.com/K8kG9Xy0Fs
— Nayan Karekar (@nayan2627) June 30, 2022