ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ ను పొడిగించిన న్యాయస్థానం

-

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్యే అనంత బాబుకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. అనంత బాబు రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో అతడిని పోలీసులు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరు పరిచారు. వాదనలు విన్న పిమ్మట కోర్టు అనంత బాబుకు మరో 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. గత మే నెల 23వ తేదీ నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న అనంత బాబు రెండు సార్లు బెయిల్ దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరించింది.

కాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కాకినాడ పోలీసుల విచారణ సరిగా లేదంటూ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర( ఏపీసీఎల్ఏ) మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. ఏపీసిఎల్ఏ అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని (హెచ్ఆర్సీ) దృష్టికి తీసుకెళ్లినట్లు ముప్పాళ్ళ సుబ్బారావు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version