మీకు జిలేబీ అంటే ఇష్టమా? ఐతే ఈ బంగాళ దుంప జిలేబి ప్రయత్నించండి..

-

భారతదేశంలో స్వీట్స్ ఇష్టపడే వారందరికీ ఇష్టమైన పదార్థం జిలేబీ (Jilebi). వీధుల్లో రోడ్డు పక్కన బండి మీద అమ్మే జిలేబి దగ్గర నుండి అద్దాల స్వీట్స్ షాప్స్ లో ఉండే జిలేబీ వరకు ప్రతీ దానికి మంచి గిరాకీ ఉంటుంది. సాయంత్రం అలా షికారు వెళ్ళినపుడు నోరూరించే చక్కటి జిలేబి చేతిలో పెడితే రుచి చూడాలని ఎవరికి ఉండదు? నోట్లో వేసుకోగానే కరిగిపోయే జిలేబీ ఇష్టపడని వారుండరు. ఐతే జిలేబీల్లో వెరైటీలు మీరెప్పుడైనా ప్రయత్నించారా? పన్నీర్ జిలేబీ, మినప పప్పు జిలేబీ ఇలా ఎన్నో.

ప్రస్తుతం బంగాళదుంపతో చేసిన జిలేబీ తయారీ గురించి తెలుసుకుందాం. బంగాళ దుంపతో జిలేబీ.. వినడానికి విడ్డూరంగా ఉంది ఉన్నా తినడానికి తియ్యగా ఉంటుంది. బంగాళదుంపతో పాటు యాలకులు, కొద్దిగా కుంకుమ పువ్వు, మైదా, నెయ్యి, చక్కెర మొదలగునవన్నీ కలిపి చేసిన ఈ జిలేబీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

ఎలా తయారు చేయాలంటే..

యాలకుల పొడి, చిటికెడు కుంకుమ పువ్వు తీసుకుని , వీటిని చక్కెర పాకంలో వేసి 5-6నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత ఒక పాత్ర తీసుకుని అందులో పిండి, పెరుగు, కొద్దిగా ఉప్పు ఇంకా ఉడికించిన మెత్తని బంగాళ దుంపలను వేయాలి. వీటన్నింటినీ మిశ్రమంలాగా తయారు చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక శుభ్రమైన వస్త్రంలోకి తీసుకోవాలి. ఆ వస్త్రానికి చిన్న రంధ్రం ఉండేలా చూసుకోవాలి.

ఇప్పుడు చక్కెర పాకాన్ని పొయ్యి మీద ఉంచి జిలేబీలని తయారు చేసుకోవాలి. జిలేబీల రంగు మారగానే బయటకి తీయాలి. జిలేబీలు పాకంలో మరుగుతున్నప్పుడు చిన్నమంట ఉండేలా చూడాలి. బయటకు తీసిన జిలేబీలను 2-3నిమిషాల తర్వాత ఆరగించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version