భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్‌ను నిర్మూలించాలంటే నిత్యం 5 సార్లు హనుమాన్ చాలీసాను పఠించాలని అన్నారు. అలా ఆగస్టు 5వ తేదీ వరకు చేయాలన్నారు. దీంతో కరోనా నాశనం అవుతుందన్నారు.
ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అయితే ఆ తేదీ వరకు అందరూ నిత్యం 5 సార్లు హనుమాన్ చాలీసాను పఠించాలని ఎంపీ ప్రజ్ఞా సింగ్ అన్నారు. తరువాత ఆగస్టు 5వ తేదీన అందరూ ఇండ్లలో దీపాలు వెలిగించి శ్రీరాముడికి హారతి ఇవ్వాలని.. దాంతో కరోనా నశిస్తుందని అన్నారు.
आइए हम सब मिलकर कोरोना महामारी को समाप्त करने के लिए लोगों के अच्छे स्वास्थ्य की कामना के लिए एक आध्यात्मिक प्रयास करें आज25 से 5 अगस्त तक प्रतिदिन शाम 7:00 बजे अपने घरों में हनुमान चालीसा का 5 बार पाठकरें5 अगस्त को अनुष्ठान का रामलला की आरती के साथ घरों में दीप जलाकर समापन करें pic.twitter.com/Ba0J2KrkA8
— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) July 25, 2020
కాగా దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,661 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 705 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13,85,522కు చేరుకుంది. 4,67,882 యాక్టివ్ కేసులు ఉండగా, 8,85,577 మంది కోలుకున్నారు. మొత్తం 32,063 మరణాలు చోటు చేసుకున్నాయి.