స్వాతంత్ర్యానికి ముందే తెలుగు భాషకు గుర్తింపు.. ఏకంగా బ్రిటీష్ నాణేంపైనే..!?

-

తెలుగు రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య సమరమోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గురించి తెలియని వారుండరూ. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆంధ్రా బ్యాంక్ లో వ్యవస్థాపకుడిగా సీతారామయ్య కృష్టా జిల్లాలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని గుండుగొలను గ్రామంలో జన్మించారు. భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీచే ప్రభావితుడై ఉద్యమంలో చేరాడు. గాంధీజీకి సన్నిహితుడిగా మెలిగి కాంగ్రెస్ లో ప్రముఖ స్థానం సంపాదించున్నాడు. పార్లమెంట్ సభ్యుడిగా, మధ్యప్రదేశ్ గవర్నర్ గా కూడా పని చేశారు. తెలుగు భాషపై ఉన్న మమకారంతో తాను స్థాపించిన ఆర్థిక సంస్థల ఉత్తర ప్రత్యుత్తరాలలోనూ తెలుగులోనే జరపాలని సూచించేవాడు. తెలుగు భాషకు ఎన్నో చిరస్మరణీయ సేవలు అందించారు.

అయితే, అప్పట్లో ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వాడివేడీగా జరిగింది. ఈ సమావేశంలో గాంధీజీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లాభాయ్ పటేల్, భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పట్టాభి సీతారామయ్య ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

పట్టాభి సీతారామయ్య తెలుగు రాష్ట్ర నిర్మాణం కోసం పడుతున్న శ్రమను చూసి సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఈ విధంగా అన్నారు. ‘‘ పట్టాభీ.. ఎప్పుడూ చూసినా ఆంధ్ర రాష్ట్రం అంటూ ఉంటావ్.. అసలు మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడందయ్యా.. మీరు మద్రాసీలు కదా..’’ అంటూ ఎగతాళి చేశారు.

దీంతో పట్టాభి సీతారామయ్య కలగజేసుకుని.. తన జేబులో ఉన్న ఒక అణాను తీసి చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సర్దార్ జీ.. అధికార భాషలైన ఇంగ్లీష్, జాతీయ భాషలైన హిందీ, అత్యధిక ప్రజలు మాట్లాడే బెంగాలీతో పాటు తెలుగు భాషలోనూ ఈ నాణెంపై ‘ఒక అణా’ అని రాశారు. ఇది బ్రిటీష్ ప్రభుత్వం తయారు చేసిన నాణేం. అప్పటికీ భారతదేశానికి స్వాతంత్ర్యం కూడా రాలేదు. మరీ ఈ నాణెంపై మా తెలుగు భాష ఉంది. కానీ మీ గుజరాతీ భాష ఎక్కడా లేదు.’’ అంటూ సమాధానం ఇచ్చారు.

ఈ మాటలు విన్నాక అందరూ నోరు తెరిచి మాట్లాడలేకపోయారు. పట్టాభీ మాటలకు సర్దార్ వల్లాభాయ్ పటేయ్ బిస్తుపోయాడు. అక్కడ కూర్చున్న వారిలో ఎక్కువ మంది గుజరాతీయులే కావడం విశేషం. స్వాతంత్ర్యానికి పూర్వమే బ్రిటిషులు తెలుగు భాషను గుర్తించి.. ఔనత్యాన్ని కల్పించారు. ఇది తెలుగు రాష్ట్ర ప్రజలు గర్వించదగిన విషయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version