ఆత్మకూరు బైపోల్.. రికార్డు్స్థాయిలో పోలింగ్..

-

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల మరణించడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య అసలైన పోరు ఉండనుందని మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిన్న ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంట‌ల స‌మయానికి పోలింగ్ కేంద్రాల వ‌ద్దకు వ‌చ్చిన వారంద‌రికీ ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించ‌డంతో ఈ ద‌ఫా రికార్డు స్థాయిలో 70 శాతం మేర పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి బ‌రిలోకి దిగగా… టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోయింది. బీజేపీ త‌ర‌ఫున భ‌ర‌త్ కుమార్ బ‌రిలో నిలిచారు. వీరిద్ద‌రు స‌హా మొత్తం 14 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కు మొద‌లైన పోలింగ్ సాయంత్రం 6 గంట‌ల దాకా కొన‌సాగింది. 6 గంట‌ల్లోగా పోలింగ్ కేంద్రాల వ‌ల్ల లైన్ల‌లో నిలిచిన వారందరికీ అధికారులు ఓటు హ‌క్కు క‌ల్పించారు. సాయంత్రం 5 గంటల స‌మ‌యానికే 61.70 శాతం మేర పోలింగ్ న‌మోదు కాగా… పోలింగ్ ముగిసే స‌మ‌యానికి ఇది 70 శాతానికి చేరి ఉంటుందని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version