సమ్మర్ వచ్చిందంటే చాలు సుర్రుమనే ఎండా వేడి మొదలవుతుంది. బయటకి వెళ్లినా.. ఇంట్లో ఉన్నా వేడి. అయితే ఈ కొన్ని చిట్కాలు పాటించి మీ ఇంట్లో వేడిని తగ్గించుకోండి. ఇప్పటికే ఎండటు దంచి కొడుతున్నాయి. రోజురోజుకూ వేడి పెరుగుతోంది. నిరంతరం ఎన్ని ఫాన్లు తిరిగినా చల్లదనం రావడం లేదు. అలాగని ఏసీ పెట్టుకుంటే… కరెంటు బిల్లు చుక్కలను తాకుతాయి.
- మొదట మీ ఇంటి ట్యూబ్‌లేట్‌ను తీసివేయండి. వాటి స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు ఉపయోగించండి. అవి కూడా తక్కువ వాట్లు ఉన్నవే వాడండి. మీకు కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది.
- కిటికీలను, వెంటిలేటర్లనుని శుభ్రంగా ఉంచుకోండి. దుమ్ము లేకుండా చెయ్యండి. వాటి ద్వారా ఇంట్లోని వేడి బయటకు పోతుంది.
- గ్లాస్‌తో కిటికీలు ఉంటే ఇబ్బందే. ఆ గ్లాస్ కలర్… డార్క్‌గా ఉండేలా చూసుకోండి. బ్లూ, గ్రీన్ వంటి కలర్స్ ఉంటే… బయటి వేడి గ్లాస్ ద్వారా లోపలికి రాదు. బయటి గాలి లోపలికి రావడానికి కర్టెన్లను పక్కకు నెట్టి… గాలిని రానివ్వాలి.
- ఇంట్లో వేడి బాగా పెరిగితే… నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి… నేలపై చల్లి తుడిచేయండి. ఉప్పు కారణంగా ఇంట్లో వేడి బాగా తగ్గిపోతుంది.
- మీ ఇంటి పరిసరాల్లో గడ్డిని పెంచండి. అది చల్లటి గాలిని ఇస్తుంది. వీలైనన్ని మొక్కలు పెంచండి. అవి గాలిలోని వేడి కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చేస్తాయి. నీడలో పెరిగే మొక్కల్ని ఇంట్లో అన్ని మూలలా ఉంచండి. సాయంత్రం వేళ నీటిని వరండాలో, గడ్డిపైన వెద జల్లితే… ఆ నీటి ద్వారా వచ్చే చల్లటి గాలి… ఇంటి లోపల వేడిని తగ్గిస్తుంది.
- జనపనారతో చేసిన వస్తువులు, షీట్లను ఎక్కువగా వాడండి. ఇంటి వరండాలో గడ్డిని పెంచండి.
- బెడ్ షీట్లు,కవర్లు, కాటన్‌ని వాడండి. కాటన్ డ్రెస్సులు వాడండి. కాటన్ వేడిని పీల్చేస్తుంది.