గంగా నదిలో రీల్స్ చేస్తూ ఓ యువతి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో మణికర్ణిక ఘాట్ వద్ద చోటుచేసుకోగా బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. యువతి రీల్స్ చేసేందుకు గంగా నదిలోకి దిగుతుండగా తోటివారు వీడియో తీసినట్లు సమాచారం.
గంగా నదిలోని నీటి ప్రవాహాన్ని యువతి అంచనా వేయకపోవడం, ఈత రాకపోవడం కూడా ప్రవాహంలో కొట్టుకుపోవడానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు యువతి కోసం గంగా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా, రీల్స్ కంటే ప్రాణాలు ముఖ్యమని, ఇలాంటి వెర్రివేషాలు వేయొద్దని నెటిజన్లు ఆ వీడియో చూసి ఫైరవుతున్నారు.
గంగా నదిలో రీల్స్.. కొట్టుకుపోయిన యువతి
తాజాగా ఓ యువతి గంగా నదిలో రీల్ చేసేందుకు యత్నించి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది.యూపీ ఉత్తరకాశీలో మణికర్ణిక ఘాట్ వద్ద ఈ ఘటన.యువతి నీటి ప్రవాహాన్ని అంచనా వేయకపోవడంతో పాటు ఆమెకు ఈత రాకపోవడంతో గంగా నదిలో మునిగి చనిపోయింది. రీల్స్ కంటే ప్రాణాలు… pic.twitter.com/osXRzARA3k
— ChotaNews App (@ChotaNewsApp) April 16, 2025