వాడిని నరికిన వాడితో పడుకుంటా :రమ్య మర్డర్ పై తెలుగు హీరోయిన్ సంచలనం

గుంటూరు దళిత యువతి రమ్య మర్డర్ కేసు… రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. తనను ప్రేమించలేదని… ఓ యువకుడు గుంటూరు జిల్లాలో లో నడిరోడ్డు పై రమ్య అనే యువతిని కత్తితో పొడిచి చంపాడు. ప్రస్తుతం ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయా పార్టీల్లోనూ చిచ్చు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే… ఈ ఘటన జరిగిందంటూ టిడిపి పార్టీ ఆరోపణలు చేస్తుంటే… తమది తప్పేం లేదు అన్నట్టు వైసిపి మాట్లాడుతోంది.

 

అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటనపై… తెలుగు హీరోయిన్ రేఖ బోజ్ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టింది. ” వాడిని కూడా అలాగే ఎవరైనా నరికేస్తే… ఆ నరికిన వాడితో పడుకుంటా… ఐ యాం సారీ. ఆ వీడియో చూశాక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడంలేదు. అంత నిస్సహతతో ఉన్నాము మేము ఈరోజు. గుంటూరు జిల్లాకు ఒక సజ్జనర్ కావాలి. రమ్య నీకు న్యాయం జరగాలి” అంటూ ఊసరవెల్లి చిత్రంలో తమన్నా పోస్టర్ను షేర్ చేసింది రేఖ భోజ్. ప్రస్తుతం రేఖ చేసిన… ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.