అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు ఓయూ జేఏసీ నాయకులు, విద్యార్ధి సంఘాలు. సంఫంహ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన ఓయూ జేఏసీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. కానీ అల్లు అర్జున్ ఇంట్లో పూల కుండీలు ధ్వంసం అయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కానీ అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి ప్రయత్నించినా చేసిన విద్యార్ధి సంఘాల నేతలను అరెస్ట్ చేసారు పోలీసులు. విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా పోలీసులు దానిని అడ్డుకున్నారు. ఇక రేవతి చావు కు కారణం అల్లు అర్జున్ నే అంటూ నినాదాలు చేస్తూ.. OU జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కానీ ఆ విద్యార్ధి సంఘాలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు.