అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటా : రేఖా నాయక్

-

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ లో కూడా నేతల మధ్య వార్ రోడ్డున పడి పోరాటాల దాకా వెళ్తుంది. తాజాగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించింది. జాన్సన్ నాయక్ పేరు ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి జాన్సన్ నాయక్ పై తీవ్రస్థాయిలో మండిపడింది.

కక్ష పూరితంగా సొంత పార్టీ నేతలే వ్యవహరిస్తున్నారని.. అభివృద్ధి పనులను ఆపివేస్తున్నారని మండి పడ్డారు ఎమ్మెల్యే రేఖా నాయక్. కావాలనే ఏసీడీబీ నిధులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన నిధులను ఇవ్వకుంటే ఖానాపూర్ చౌరస్తాలో ధర్నా చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ హెచ్చరికలు జారీ చేశారు.రూ.2.25 కోట్ల నిధులను ఆపేసి తనను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతగానో పని చేశానని.. వచ్చే ఎన్నికల్లో తాను రెబల్ గా ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలోకి దిగుతానని పేర్కొన్నారు రేఖా నాయక్. అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలకు తగిన బుద్ధి చెబుతారని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version