పెళ్లికి ముందు ఈ విషయాల్లో క్లారిటీ మస్ట్ గురూ..!

-

వివాహం అనేది ఏడు జన్మల బంధం అంటారు. అందుకే పెళ్లి చేసే ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలంటారు. ప్రేమ పెళ్లైనా, పెద్దలు కుదుర్చిన వివాహమైనా అన్నీ కుదిరాకే ఓ మాటకొస్తారు. అయితే పెళ్లంటే కేవలం పెద్దవాళ్లకే కాదు పెళ్లి చేసుకునే వారికీ కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండాలి. అలా అయితేనే ఫ్యూచర్ లో ఎలాంటి సమస్యలు రావంటున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. ఇంతకీ మీ ఫ్యూచర్ లైఫ్ పార్ట్ నర్ గురించి మీరు ఏం విషయాలు తెలుసుకోవాలి.. వాళ్ల గురించి మీకు ఏ విషయాల్లో క్లారిటీ ఉండాలంటే..?

ఏ రిలేషన్ కు అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మూలం డబ్బు. అందుకే బంధాన్ని ముడిపెట్టేది.. విడదీసేది డబ్బే అంటుంటారు. డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య చాలా గొడవలు వస్తుంటాయి. ఒకరికి పొదుపు చేసే అలవాటుంటే మరొకరు దుబారాగా ఖర్చు చేస్తారు. అందుకే రిలేషన్ లో గొడవకు ముఖ్యమైన కారణమైన ఆర్థిక విషయాల గురించి ఓ క్లారిటీ ఉండాలి. మీకు కాబోయే భాగస్వామి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఎలా ఉంటారో తెలుసుకోవాలి. అందుకే పెళ్లికి ముందే వీటి గురించి మీరు చర్చించుకోవాలి. ఇద్దరికీ జీతం ఎంత వస్తోంది.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారు.. పెళ్లయ్యాక ఎలా ఖర్చు చేస్తారు.. ఎలా పొదుపు చేస్తారు.. ఇలా ఓ ఆర్థిక ప్రణాళిక ముందే రెడీ చేసుకోవాలి. ఎప్పుడైతే డబ్బు విషయంలో ఇద్దరు ఓ తాటిపైకి వస్తారో ఇక సగం గొడవలు ముగిసినట్లే.


కొందరు ఒకరిని ప్రేమిస్తారు. పరిస్థితుల వల్ల మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి మీరు మానసికంగా రెడీ అయితే ఫర్వాలేదు. కానీ మనసులో ఒకరుండి.. ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఇద్దరి జీవితాలు రెండు కుటుంబాలు ఆగమైపోతాయి. ఇంకొకరితో పెళ్లికి రెడీ అయితే గత జ్ఞాపకాలను మీరు చేసుకోబేయే భాగస్వామి వద్ద దాచడం కరెక్ట్ కాదు. కాబట్టి మీ గురించి అన్ని విషయాలను ముందే చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ల స్పందనని బట్టి ఏం చేయాలో డిసైడ్ అవ్వండి. కొందరు ముందు సరేనని లైట్ తీసుకున్నా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ల అసలు రంగు బయటపెడతారు. ఇలాంటి వాళ్లను ముందే గుర్తించడం కష్టం. అందుకే మీరు మీ గురించి చెప్పబోయే ముందు ఎదుటివాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో.. వాళ్లెలాంటి వారో ఓసారి క్లారిటీ వచ్చాక మీ విషయాలు షేర్ చేసుకోవడం ఉత్తమం.

ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయడం కామన్. కానీ కొంతమందికి తమ వైఫ్ ఉద్యోగం చేయడం నచ్చదు. ఈ విషయంలో గొడవలు రావొద్దంటే పెళ్లికి ముందే ఈ విషయాన్ని మీ పార్ట్నర్ తో చర్చించాలి. అలాగే మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాడ్లాడాలి. వాళ్ల ఆలోచనలు తెలుసుకోవాలి. దాన్ని బట్టి వాళ్లను పెళ్లి చేసుకోవాలో వద్దో ఓ క్లారిటీ వస్తుంది.

ఇక వీటితో పాటు పెళ్లయ్యాక పిల్లల విషయంలో, ఎవరి వ్యక్తిగత సమయాల్ని వాళ్లకు వదిలేసే విషయంలో, ఉమ్మడి కుటుంబమా? లేదంటే విడిగా ఉండాలా?.. వంటి అంశాల్లో కూడా ముందే ఓ స్పష్టత తెచ్చుకుంటే వైవాహిక బంధంలో గొడవలకు తావుండదు. తద్వారా జంటలు తమ అన్యోన్య దాంపత్యాన్ని పది కాలాల పాటు పదిలపరచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version