‘చెక్’ లో రకుల్ పోస్టర్ రిలీజ్.. డిఫరెంట్ లుక్ లో హాట్ బ్యూటీ..?

-

బాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో రకుల్ తో పాటు ప్రియా ప్రకాష్ వారియర్ కూడా నటిస్తోంది. అయితే చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన రకుల్ కు సంబంధించిన ఫస్ట్ అప్డేట్స్ కోసం అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన రకుల్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం.

నేడు రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా అభిమానులందరికీ ట్రీట్ ఇస్తూ రకుల్ ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రకుల్ లుక్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఎంతో సీరియస్గా ఫైల్ పట్టుకుని చూస్తున్న రకుల్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక రకుల్ అప్డేట్ రావడంతో అభిమానులు అందరూ ఫుల్ ఖుషీ అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news