అమరావతి : ఏపీ రిటైల్ పార్క్స్ పాలసీ విడుదల చేసింది జగన్ సర్కార్. 2021-26 కాలానికి రిటైల్ పార్క్స్ పాలసీని రూపొందించిన ఏపీ ప్రభుత్వం…. ఏపీలో రిటైల్ రంగానికి ఊతమిచ్చేలా పాలసీని రూపకల్పన చేసింది. రిటైల్ రంగంలో పెట్టుబడులు.. ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలసీని రూపొందించింది జగన్ సర్కార్.
వచ్చే ఐదేళ్ల కాలంలో రిటైల్ రంగంలో రూ. 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టే విధంగా రిటైల్ పార్క్స్ పాలసీ రూపకల్పన చేసింది. అలాగే… రిటైల్ పార్క్స్ పాలసీ ద్వారా ఐదేళ్లల్లో 50 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ సర్కార్. రిటైల్ పార్క్స్ డెవలపర్స్, రిటైల్ వ్యాపారస్తుల కోసం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా నోడల్ అధికారుల నియామకం చేసింది. అలాగే… ఆన్‌లైన్ క్లియరెన్స్‌ల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీ రిటైల్ పార్క్స్ పాలసీని చాలా పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.