తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ ఈ రోజు విడుదల చేశారు. తెలంగాణ లో మొత్తం 12 ఎమ్మెల్యే సీట్లకు ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ షడ్యూల్ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక్కొ స్థానం లో ఉన్న ఖాళీలకు అలాగే కరీంనగర్ , మహబూబ్ నగర్ తో పాటు రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు.
దీనికి సంబంధించి ముఖ్యమైన తేదిలు ఇలా ఉన్నాయి.
నవంబర్ 16న నోటిఫికేషన్
నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ
నవంబర్ 24 నామినేషన్ల పరిశీలన
నవంబర్ 26 ఉపసంహరణకు చివరి తేదీ
డిసెంబర్ 10 పోలింగ్
డిసెంబర్ 14 కౌంటింగ్
పోలింగ్ సమయం ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. కరోనా సమయం కాబట్టి కొన్ని నిబంధనలు ప్రకటించారు. ఎన్నికలు జరుగుతున్న చోట వంద శాతం వ్యాక్సినేషన్ వేయాలి. అదే విధంగా ఈ రోజు నుంచే కోడ్ అమలులో ఉంటుంది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో ఈ కోడ్ అమలో ఉంటుంది. అలాగే 500 మంది కంటే ఎక్కువ మందితో సభలు సమావేశాలు పెట్టారాదు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహిస్తారు.