ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వీరు అకౌంట్ నుంచి రూ.5 వేలకు మించి తీసుకోలేరు..!

-

తాజాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఓ బ్యాంక్ కి ఝలక్ తగిలింది. అయితే దీని మూలంగా ఆ బ్యాంక్ కస్టమర్స్ కి కూడా కాస్త ఇబ్బంది వచ్చేలా కనపడుతోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. తాజాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నిర్ణయం తీసుకుంది.

 

RBI

మహరాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బాబాజీ దాతే మహిళా సహకారి బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. అదే విధంగా ఆర్బీఐ ఆ బ్యాంక్ కి మనీ విత్‌డ్రా పై లిమిట్స్ ని కూడా పెట్టడం జరిగింది. దీని వలన బ్యాంక్ లో ఖాతా కలిగిన వారు తమకి నచ్చినంత అమౌంట్ ని విత్ డ్రా చేసుకునే అవకాశం లేదు అని తెలుస్తోంది.

అయితే ఈ బ్యాంక్ కస్టమర్లకు కేవలం రూ.5 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం వుంది అని తెలుస్తోంది. అలానే బ్యాంక్ ఇకపై కొత్తగా డిపాజిట్లు తీసుకోకూడదు. అంతే కాదు కస్టమర్లకు రుణాలు కూడా జారీ చేయకూడదు అని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్‌బీఐ బ్యాంక్ ప్రస్తుత లిక్విడిటీ పొజిషన్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version