#RishtonKaDhaga, ఆభార్ పేరుతో సరికొత్త కలెక్షన్ థీమ్ ని రిలయన్స్ జువెల్స్ ( Reliance Jewels ) ముందుకు తీసుకువచ్చింది. ఆల్రెడీ ఉన్న కలెక్షన్లకు అదనంగా ఆభార్ ను లాంచ్ చేసింది. ఈ లాంఛింగ్ ద్వారా వినియోగదారులు, కళాకారులతో తమ బంధాన్ని మరింత దృఢపరుచుకుని కృతజ్ఞతా భావాన్ని తెలియజేయాలని రిలయన్స్ జువెల్స్ ఆలోచన. ఈ సంవత్సరంలోని కొత్త కలెక్షన్లయిన తర్కషి, క్రోచెట్, మేక్రోమ్ ద్వారా ప్రేరణ పొంది ఆభార్ ను రూపొందించింది.
ఈ కలెక్షన్ లో అబ్బురపరిచే హస్తకళా నైపుణ్యంతో కూడిన బంగారు, వజ్రాల చెవి రింగులు కనిపిస్తాయి. దీంతో పాటు మిక్స్ డ్యాంగ్లర్స్, ఫ్రింజస్, డ్రాప్స్, శాండిలర్స్, జుంకా, స్టడ్స్, షాండ్లియర్స్ ఉన్నాయి. ఇవే కాక బంగారు ఆభరణాల తయారీ, వజ్రాల ఆభరణాల విలువలో 20శాతం తగ్గింపు ఇస్తున్నట్టు ఆనివర్సరీ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది.
ఈ కలెక్షన్ తీసుకురావడం వెనక ఉన్న ఆలోచన గురించి చెప్పాలంటే, మమల్ని మీతో, మిమ్మల్ని మాతో చేర్చిన ఒక బంధం.. ప్రేమని, కళని కలిపే దారం. అని చెప్పుకొచ్చింది. రిలయన్స్ జువెల్స్ ఆభరణాలపై విశ్వాసం పెంచుకున్నందుకు, విభిన్న హస్తకళా నైపుణ్యంతో కూడిన ఆభరణాలను అందించేందుకు ప్రేరణ అందించినందుకు దన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఈ కలెక్షన్ గురించి మాట్లాడిన రిలయన్స్ జువెల్స్ సీఈవో సునీల్ నాయక్, ఇలా అన్నారు. ఇన్ని సంవత్సరాలుగా మాకు సపోర్టు చేసి, మాపై విశ్వాసం చూపించిన అందరికీ ఈ కలెక్షన్, క్యాంపై ద్వారా దన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్కష , మేక్రోమ్, క్రోచెట్ ద్వారా ప్రేరణ పొందిన మా ఆభార్ కలెక్షన్ ద్వారా విశ్వాసం, ప్రేమ, మరింత పెరిగి బంధం దృఢంగా అశిస్తూ, మా ఆభరణాలతో వినియోగదారులు అందమైన అనుభూతులను పొందాలని కోరుకుంటున్నాము.