కేవలం డాటాకే డబ్బు చెల్లించండంటూ… టెలికాం నెట్వర్క్ రంగంలోకి దిగిన జియో సంచలనాలను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అనతి కాలంలోనే అత్యధిక మంది వినియోగదారులను సంపాదించుకుంది. అతి తక్కువ ధరకు 4 జీ డాటాను అందిస్తుండటంతో దేశంలో చాలా మంది సబ్‌స్క్రైబర్లు ఇతర నెట్ వర్క్ ల నుంచి జియోకు మారారు. ప్రస్తుతం రిలయన్స్ జియోకు 42 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
ఇదిలా ఉంటే రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధం అవుతోంది. దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధం అవుతోంది. దేశంలో 1000 ప్రధాన నగరాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద 5జీ సేవలను అందించేందుకు ప్లాన్స్ రెడీ చేస్తోంది. 5జీ సేవల విస్తరణ కోసం టీం లను రెఢీ చేశామని.. అందుకోసం 3డీ మ్యాప్స్ వంటి లెటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నామని తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యం, ఇండస్ట్రీయల్ ఆటోమెషన్ రంగంలో 5జీ ట్రయల్స్ చేస్తున్నామని.. అనుమతులు రాగానే నెట్ వర్క్ విస్తరణ పనులు చేస్తామని జియో తెలిపింది.