రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్ల కోసం సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రస్తుతం. రిలయన్స్ జియో సంస్థ స్థాపించిన కొద్దీ రోజులకే అందరిని అధిగమించి ముందుకు దూసుకెళ్తోంది. మన దేశంలో 40 కోట్ల మంది యూజర్లును దక్కించుకున్న తొలి టెలికం సంస్థగా నిలచిన జియో ఇప్పుడు మరింత మందికి చేరువ కావాలని ఆలోచనతో కొత్త కొత్త ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈమధ్యనే కంపెనీ కొత్త పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ కూడా తీసుకువచ్చింది.
జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ ధర రూ.399 నుంచి ప్రారంభం అవుతుంది. దీని గరిష్ట ధర రూ.1,499 వరకు ఉంది. ఈ ప్లాన్లకు ఒక్కో దానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. జియో తన పోస్ట్ పెయిడ్ ప్లాన్లతోపాటు తమ కస్టమర్స్ కు అనేక సర్వీసులను కూడా ఉచితంగానే అందిస్తోంది. దీంతో జియో యూజర్లకు చాలా లాభం కలుగుతుంది. జియో తన పోస్ట్ పెయిడ్ ప్లాన్లతో పాటు కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్, డిస్నీ + హాట్స్టార్ వంటి అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు 300 జీబీ హైస్పీడ్ డేటా అదనంగా పొందొచ్చు. ఇంతే కాకుండా ఒకవేళ డేటా నెలలో పూర్తిగా వినియోగించకపోతే అది వచ్చే నెలకు రోల్ ఓవర్ అవుతుంది. అంటే ఆ డేటాను తర్వాతి నెలలో ఉపయోగించుకోవచ్చు.
జియో ఇతర ప్లాన్ల మాదిరిగానే ఈ ప్లాన్లలోనూ అన్ని జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ పై పూర్తి ఉచితంగా లభిస్తుంది. అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్‌లు వంటి లాభాలు పొందొచ్చు. అయితే ఈ ప్లాన్ ఎంచుకునే ముందు కస్టమర్లు జియో ప్రైమ్ కోసం అదనంగా రూ.99 చెల్లించాల్సి వస్తుంది. దీనితో అదనంగా అమెరికా, యూఏఈ వంటి దేశాలకు కూడా ఉచితంగానే అపరిమిత కాల్స్ చేసుకోనే సౌలభ్యం కూడా కల్పిస్తుంది జియో సంస్థ.