Hyd: కంటిలో నలక పడిందని వస్తే సర్జరీ అన్నారు.. చిన్నారి మృతి!

-

Hyd: కంటిలో నలక పడిందని వస్తే సర్జరీ అన్నారు.. దీంతో చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన హైదరాబాద్‌ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. చిన్నారి అన్విక(5) కంటిలో నలకను తీసేయాలంటే సర్జరీ చేయాలని సూచించారు వైద్యులు.

Anand Eye Institute Hospital, Hyderabad is atrocious

ఈ తరుణంలోనే… సర్జరీ చేసే ముందు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కాసేపటికే పాప హార్ట్ బీట్ ఆగింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే ఎల్బీనగర్ రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌కు తరలించారు. పాప స్పృహలో లేదని, మృతి చెందినట్లు నిర్ధారించారు రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు. దీంతో…ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ వద్ద హన్విక బంధువులు ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version