మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది.. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు ఎన్నికల సిబ్బంది.. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనుంది సిబ్బంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలోనే బీజేపీ అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రంలో 44 స్థానలకు పైగా బీజేపీ లీడ్ లోకి వచ్చింది.
కాంగ్రెస్ 7 స్థానాల్లో.. ఇతరుల 1 స్థానంలో ఆధిక్యం ఉన్నాయి. అటు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల కౌంటింగ్..కొనసాగుతోంది. వయనాడ్‌లో ఆధిక్యంలో ప్రియాంక గాంధీ ఉన్నారు.. కొప్రిలో ఏక్‌నాథ్ షిండే ఆధిక్యంలో ఉన్నారు.. బారామతిలో అజిత్ పవార్ వెనుకంజలో ఉన్నారు.