జస్ట్ డయల్ గురించి అందరికీ తెలుసు. ఈ జస్ట్ డయల్ ప్లాట్‌ఫామ్‌లో లక్షలాది ఉత్పత్తులు , సేవలను విస్తరించడంలో పని చేస్తుంది. జస్ట్ డయల్ , ప్రస్తుత డేటాబేస్‌కు పెట్టుబడి కూడా మద్దతు ఇస్తుంది. 31 మార్చి 2021 నాటికి, జస్ట్ డయల్ దాని డేటాబేస్‌లో 30.4 మిలియన్ జాబితాలను కలిగి ఉంది, త్రైమాసికంలో 129.1 మిలియన్ల ప్రత్యేక వినియోగదారులు జస్ట్ డయల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే రిలయన్స్ గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) జస్ట్ డయల్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..
సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం కంపెనీని నియంత్రించడానికి ఈ కంపెనీలో అవసరమైన వాటాను RRVL కొనుగోలు చేసింది. ఇప్పటికి జస్ట్ డయల్‌లో ఆర్‌ఆర్‌విఎల్‌కు 40.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2021 జూలై 20 న, RRVL 1.31 కోట్ల షేర్లను రూ .10 పేస్ వేల్యూ కలిగిన ఒక్కో షేరుకు రూ. 1020 చొప్పున జస్ట్ డయల్‌ని కొనుగోలు చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజ్, బ్లాక్ విండో సౌకర్యం కింద ఒప్పందం జరిగింది.
ఈ వివరాలని సెప్టెంబర్ 1న కంపెనీ ప్రకటన చేసింది. జస్ట్ డయల్ లిమిటెడ్‌ను జూలైలో కొనుగోలు చేసినట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) జూలైలో కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఇది ఇలా ఉంటే అగ్రిమెంట్ ప్రకారం జస్ట్ డయల్ మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా VSS మణి తన డ్యూటీ ని చేస్తారు.
రిలయన్స్ రిటైల్ భారతదేశంలో అతిపెద్ద అత్యంత లాభదాయకమైన రిటైలర్ కంపెనీ. ఇది డెలాయిట్ గ్లోబల్ పవర్స్‌లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైలర్‌లలో జాబితా చేయబడింది. జస్ట్ డయల్ భారతదేశంలోని ప్రముఖ స్థానిక సెర్చ్ ఇంజిన్ ప్లాట్‌ఫారమ్. ఇది కూడా ఎన్నో సేవలని ఇస్తుంది.