చాలా మంది బ్యాంకుల నుండి పర్సనల్ లోన్ తీసుకుంటూ వుంటారు. మీరు కూడా పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా..? అయితే పర్సనల్ లోన్ ని తీసుకోవాలంటే ముందు ఈ విషయాలని చూడాలి. పర్సనల్ లోన్ ని తీసుకోవాలంటే లోన్ మీ ప్రొఫైల్ మీదే ఆధారపడి ఉంటుంది. అయితే పర్సనల్ లోన్ రావాలంటే క్రెడిట్ స్కోరు తప్పనిసరి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..
ప్రస్తుత ఆర్థిక అవసరాలను తీర్చడానికి పెర్సనల్ లోన్ హెల్ప్ అవుతుంది. సాలరీ అకౌంట్ వున్నా బ్యాంక్ లో కానీ లేదంటే ఇప్పటికే హోం లోన్, కార్ లోన్ ఇలా ఏదైనా వున్నా బ్యాంక్ లో కానీ పెర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది. తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేసే బ్యాంకులు ప్రాసెసింగ్ ఛార్జీలు ఎక్కువగా తీసుకుంటూ ఉండచ్చు చూసుకోండి.
జప్తు కోసం పెనాల్టీలను కూడా అధికంగా విధించొచ్చు కనుక జాగ్రత్త పడండి. క్రెడిట్ స్కోరు ని చూసుకోవాలి. లోన్ వీలైనంత త్వరగా అప్రూవ్ అవ్వాలంటే క్రెడిట్ స్కోర్ బాగుండాలి. వేరే లోన్లు ఉన్నట్లయితే ఆ బకాయిలు సకాలంలో క్లియర్ చేస్తూ వుండండి. లేదంటే పర్సనల్ లోన్ పొందడం కష్టం అవుతుంది. క్రెడిట్ స్కోరును వాట్సాప్ ద్వారా ఉచితంగా మీరు తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా చూసేద్దాం. Experian India వాట్సాప్ నంబర్ 9920035444 కు Hai అని మీరు మెసేజ్ చేయాలి. లేదా మీరు https://wa.me/message/LBKHANJQNOUKF1 కి వెళ్లి తెలుసుకోవచ్చు. డెయిల్స్ ఇచ్చేస్తే సరి పోతుంది.