సోమేశ్ కుమార్ ను తెలంగాణ కేడర్ నుంచి కేంద్రం రివీల్ చేసిన నేపథ్యంలో ఏపీలో ఆయన చేరికపై సందిగ్ధత నెలకొంది. కేంద్రం ఆదేశాలు ప్రకారం రేపు ఏపీలో సోమేశ్ కుమార్ రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే ఆయన ఏపీకి వెళ్తారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఏపీకి వెళ్లి రాజీనామా చేసేయోచనలో సోమేశ్ ఉన్నారని, ఆయనను సలహాదారుడిగా సీఎం కేసీఆర్ నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, హైకోర్టు తీర్పు కారణంగా సోమేశ్ కుమార్ రిలీవ్ నేపథ్యంలో తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరనేది ఉత్కంఠగా మారింది.
ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. రాష్ట్ర కేడర్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిహోదాలో వసుధామిశ్రా, రాణికుమిదిని, శాంతికుమారి, శశాంక్ గోయల్, సునీల్‌శర్మ, రజత్‌కుమార్, రామకృష్ణారావు, అశోక్‌కుమార్, అర్వింద్ కుమార్ ఉన్నారు.