దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో జనాలు గుంపులు గుంపులుగా ఉండే ప్రాంతాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ తో పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ కేసులు కూడా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో భారీగానే నమోదు అవుతున్నాయి. దీంతో ఆగ్రాలో ఉన్నా తాజ్ మహల్ పై అధికారులు స్వల్పంగా ఆంక్షలు విధించారు. తాజ్ మహల్ లో ఉండే మాన్యూవల్ టికెట్ కౌంటర్లను అధికారులు మూసివేశారు.
తాజ్ మహల్ పరిసర ప్రాంతాలలో మాన్యూవల్ టికెట్ కౌంటర్లు ఉండటం వల్ల సందర్శకులు గుంపులు గుంపులు గా ఉంటున్నారు. అయితే గుంపులు గుంపులు గా జనాలు ఉంటే కరోనా వైరస్, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజ్ మహల్ సందర్శనను పూర్తి గా నిలిపివేయలేదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే తాజ్ మహల్ సందర్శనకు వచ్చే వాళ్లు తప్పకుండా కరోనా నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు.