ఓఆర్‌ఆర్‌లపై టోల్ ప్లాజాల తొలగింపు : నితిన్ గడ్కరీ

-

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభలో ప్రశ్నగంట సమయంలో ఓఆర్‌ఆర్‌లపై (ఔటర్ రింగ్ రోడ్డు) ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. అమ్రోహాకు చెందిన బీఎస్‌పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీ గర్హ్ ముక్తేశ్వర్ మునిసిపల్ పరిధిలోని టోల్ ప్లాజాల గురించి ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం తెలిపారు.

టోల్ ప్లాజా

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో రోడ్డు ప్రాజెక్టు ఒప్పందాల్లో ఎన్నో నిబంధనలు జోడించిందన్నారు. నగర సరిహద్దుల్లో ఔటర్ రింగ్ రోడ్డులపై అనవసంగా టోల్ ప్లాజాలను నిర్మించిందన్నారు. దీని వల్ల ప్రభుత్వం, వాహనదారులు అన్యాయం జరిగిందన్నారు. అందుకే టోల్ ప్లాజాలను రద్దు చేసే ప్రణాళికపై ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిందని, ఫాస్ట్ ట్యాగ్ వంటి విధానం అమలు వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. టోల్ ప్లాజాలు లేకుండా వాహనదారులు ఆన్‌లైన్‌లో టోల్ ఛార్జీలు చెల్లించవచ్చన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఫ్యాస్ట్ ట్యాగ్ విధానం అమలు చేయడం జరుగుతుందని, వచ్చే ఏడాదిలోని టోల్ ప్లాజాలను తొలిగించి, టోల్ వసూలు విధానాన్ని రద్దు చేయడం జరుగుతుందన్నారు.

టోల్ ప్లాజాలను తొలగిస్తే రహదారి తయారీ సంస్థకు భారీ నష్టం చేకూరుతుందని, ఈ మేరకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తుందన్నారు. వచ్చే ఏడాదిలోగా దేశంలో అన్ని టోల్ ప్లాజాలను తొలగించి వాహనదారుల సమయాన్ని వృథా చేయకుండా చూడవచ్చన్నారు. ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టెక్నాలజీని మరింత అభివృద్ధి చేస్తామని, హైవేలపై వాహనం వచ్చినప్పుడు జీపీఎస్ సాయంతో ఫోటోలు తీసుకుని టోల్, రోడ్డు ఛార్జీలను చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారుల సౌకర్యార్థం టోల్ ప్లాజాలను తొలగిస్తున్నామన్నారు. దీంతో సమయాన్ని ఆదా చేయోచ్చన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version