ఇప్పుడు రాష్ట్రంలో రాజధాని విషయం అత్యంత హైలెట్ అయిన అంశం కాబట్టి ప్రతి పార్టీ వారు ఏదో ఒక రీతిలో ఆ విషయంపై తమ వాదన పైచేయి సాధించేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తమ చేతిలో ఉన్న మీడియా అనే అస్త్రంతో రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు తమ వైపు వాదనను ప్రజలకు వినిపిస్తుండగా అందులో ఈనాడు మాత్రం రాజధాని తరలింపు విషయంలో కొంచెం లాజిక్ లెస్ గా వ్యవహరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అనే పేరును సూచించింది రామోజీరావు అని స్వయంగా చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. మరి అక్కడి నుండి రాజధానిని తరలిస్తూ ఉంటే ఈనాడు సైలెంట్ గా ఉండదు కదా. కానీ వారి ప్రచురణలు అన్నింటిలో అమరావతి నుంచి రాజధాని తరలించడం సరికాదని.. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని చెబుతున్నారే తప్ప అసలు విశాఖలో రాజధాని పెట్టడం ఎందుకు మంచిది కాదని చెప్పడమే లేదు.
ఈనాడు నాలుగు రోజుల కిందట… విశాఖ రాజధాని అయితే.. సీమ వాసులకు ఎంత దూరమవుతుందో.. వివరిస్తూ. .. ఫుల్ పేజీ కథనం ప్రచురించారు. అందులో ఎక్కడా రాజధాని మార్పుకు అనుకూలమా.. వ్యతిరేకమా..లాంటి వ్యాఖ్యలు లేవు. కేవలం దూరాభారం గురించి మాత్రమే రాశారు. ఇక్కడే అర్థమవుతుంది వారు ఎంత గుడ్డిగా ప్రజలను నమ్మించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా అని. కానీ వాటిలో ఏ ఒక్కటీ ఇప్పటిదాకా సఫలం కాకపోవడం గమనార్హం.