మాస్ మహారాజు రవితేజ వరుస సినిమాలతో దూసుకువెళుతున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వలో.. ఖలాడీ సినిమాను పూర్తి చేశారు హీరో రవితేజ. ప్రస్తుతం శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నారు. అలాగే.. ధమాకా, రావణాసుర సినిమాలను కూడా లైన్ లో పెట్టారు మాస్ మహారాజు రవితేజ. వీటితో పాటు.. టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒప్పుకున్నారు.
రవితేజ లైనప్ చూసి కుర్ర హీరోలే షాక్ అవుతున్నారు. అయితే.. వంశీ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న టైగర్ నాగేశ్వరావు సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో రవితేజ సిస్టర్ రోల్ ఉంటుందట. దాని కోసం రేణు దేశాయ్ ను తీసుకోవాలని చూస్తున్నారు దర్శకుడు. ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. కానీ ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదని సమాచారం అందుతోంది. ఒకవేళ రేణు దేశాయ్ ఒప్పుకోక పోతే… భూమికను సంప్రదించాలని కూడా చిత్ర బృందం అనుకుంటుదని సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.