మీడియాపై రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే మీడియా ఫోకస్ మాత్రం వేరే దానిపై వుందని మండి పడింది. ఇటవల ఉత్తర ప్రదేశ్‌లో 19 ఏళ్ల అమ్మాయిని అతి దారుణంగా మానభంగం చేసి హత్య చేశారు కొంత మంది దుండగులు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ట్విట్‌లు చేస్తున్నారు.
అయితే మీడియా మాత్రం పెద్దగా ఈ సంఘటన విషయంలో స్పందించ లేదనిదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రేణు దేశాయ్ కూడా అదే విషయాన్ని ప్రస్థావించి మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సుశాంత్ మృతి తరువాత రియా కారణంగా డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిన జాతీయ మీడియా వరుస కథనాలని ప్రసారం చేస్తోందని, దేశ వ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతుందే దాన్ని వదిలేసి మీడియా ఫోకస్ మాత్రం మరో అంశంపై వుందని మండిపడింది.
సుశాంత్ కేసు విషయంలో మీడియా అతిగా స్పందిస్తోందని, అదే ముఖ్యం కాదని, ఓ అమ్మాయిని దారుణంగా మనభంగం చేసి చంపేసిన ఘటన జాతీయ మీడియాకు కనిపించలేదా? అని నిప్పులు చెరిగింది. గత రెండు నెలలుగా మీడియాలో డ్రగ్స్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే వారికి ఓ సామాన్యురాలి ఆవేదన కనిపించలేదా అని ప్రశ్నించింది.