యాదాద్రిలో మళ్లీ మరమత్తులు

-

రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పలు చోట్ల రోడ్లు, పంటలు దెబ్బతిన్నాయన్న విషయం తెలిసిందే. తెలంగాణలోని ప్రధాన ఆలయమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి పరిసరాలు కూడా వర్షపునీటితో చెల్లాచెదురైంది. ప్రధానాలయ పరిసరాలు, క్యూలైన్లు వర్షం నీటితోపాటు లీకవుతున్న ప్రధానాలయం మండపాలకు మరమత్తులు మొదలు పెట్టారు. ఈ మేరకు ఆలయ అధికారులు వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని పనులకు సిద్దమైనారు. సన్నిధిలో ఎక్కడెక్కడ వర్షపు నీరు చేరి మట్టి పేరుకపోయిందో పరిశీలించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కొండపైనే గల విష్ణు పుష్కరిణి వద్ద మట్టి అంతా ఒకేచోటకు పేరుకుపోవడంతో దానిని ప్రత్యేక సిబ్బందితో తొలగిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా పనులు శరవేగంగా జరుగాలని ఆలయ అధికారు వెల్లడించారు. కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, రింగ్‌ రోడ్డు వద్ద ఆర్అండ్ బీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో వర్షం నీటితో చెత్తా చెదారంతో నిండిన మట్టిని తీసి పక్కన పోస్తున్నారు. క్యూలైన్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఇంకా శిల్పులు వాటర్‌ క్యూరింగ్‌ పరిశీలించి పనులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version