ఐరోపా: భారీ వర్షాలతో పెను విపత్తు సంభవించింది. వరద దాటికి ఇప్పటివరకూ 160 మందికి పైగా మృతి చెందారు. పశ్చిమ జర్మనీలోని పాలటినేట్ రాష్ట్రంలో 98 మంది చనిపోయారు. వెస్ట్ ఫాలియా రాష్ట్రంలో 43 మంది మరణించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
వరదల్లో వందలాది మంది గల్లంతయ్యారు. జర్మనీ సైన్యం వరద సహాయ చర్యల్లో పాల్గొన్నారు. భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింనట్లు జర్మనీ అధ్యక్షుడు స్టెయిన్ మీర్ తెలిపారు. స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్‌లోనూ వరదలు విలయం సృష్టించాయి.
ఇక వరదల వల్ల జర్మనీ, బెల్జియంలో చాలా ఇళ్లు కూలిపోయాయి. కార్లు, ఇతర వాహనాలు కాగితం పడవల్లా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇలా పడి ఉన్న కార్లు, ట్రక్కుల్లో మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.