రిజర్వ్ బ్యాంకు కీలక ప్రకటనలు…!

-

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక ప్రకటనలు చేసింది. గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలు అయ్యాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఖరీఫ్‌లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగిందని అన్నారు. భారత్‌ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్‌ అంచనావేసిందన్న ఆయన… జీ-20 దేశాల్లో భారత్‌ జీడీపీనే అధికంగా ఉందని వివరించారు.

జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చామని వివరించారు. బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయనివివరించారు. 2021-22 ఏడాదికి వృద్ధిరేటు 7.4శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్‌ తర్వాత రూ.1.20లక్షల కోట్లు విడుదల చేశామని చెప్పుకొచ్చారు. దేశ వ్యాప్తంగా 91శాతం ఎటీఎంలు పనిచేస్తున్నాయని అన్నారు.

రెపో రేటు యథాతథ౦గా ఉంటుందని అన్నారు. విపణిలో ద్రవ్య లభ్యతను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రుణ లభ్యతను వీలైనంత ఎక్కువగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆర్థిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మార్కెట్లలో పనులు కార్యకలాపాలు పుంజుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని… రూ. 50 వేల కోట్లతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

రూ. 50 వేల కోట్లతో ఆర్థిక సంస్థలు నాబార్డ్, సిడ్బీ తోడ్పాటు, నాబార్డుకు రూ. 25 వేల కోట్లు ఇస్తున్నామని అన్నారు. నేషనల్ హౌసింగ్ బోర్డుకు రూ.10 వేల కోట్లు కేటాయించామని అన్నారు. రివర్స్ రెపో రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు ( బ్యాంకుల నుంచి వసూలు చేసే వడ్డీ) 3.75 శాతం తగ్గించినట్లు ప్రకటించారు. రాష్ట్రాలకు అందించే Ways and Means Advances (WMA) 60 శాతానికి పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version