సౌందర్య స్థానం ఎప్పటికీ శాశ్వతమే..!

-

సౌత్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, కన్నడ .. ఇలా ఏ చిత్ర పరిశ్రమ తీసుకున్నా కూడా హీరోయిన్ కి లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఎన్ని సినిమాలు చేసిన క్రేజీ హీరోయి అన్న పేరు తప్ప చరిత్రలో మిగిలిపోయో గొప్ప పేరు మాత్రం సప్మాదించుకోవడం చాలా కష్టం. అలా సంపాదించుకున్న వాళ్ళు వేళ్ళ మీదే లెక్కపెట్ట వచ్చు. అలాంటి గొప్ప నటి సౌందర్య. అప్పట్లో సావిత్రి ఎలాగో ఈ కాలంలో సౌందర్య ని అలా కీర్తించారు యావత్ తెలుగు ప్రేక్షకులు ఇండస్ట్రీ పెద్దలు.

సీనియ‌ర్ న‌టులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి లాంటి మహానటులు ఎంద‌రో ఉన్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో సావిత్రి నటన అద్వితీయంగా ఉండేది అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అందుకే అప్పట్లో సావిత్రి లేకుండా సినిమా ఉంటుందా అని అందరూ అనుకునే వారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో పోటా పోటీగా సావిత్రి కి ఛాన్సులు విప‌రీతంగా వ‌చ్చేవి. అయితే సావిత్రి మ‌ర‌ణానంత‌రం మ‌ళ్ళీ అంత‌టి గొప్ప న‌టి ఎవరూ కనింప్చలేదు అని చిత్ర పరిశ్రమ అనుకుంటుమ్న్న సమ్యంలొ సౌందర్య రూపంలో మళ్ళీ ప్రత్యక్ష్యమైంది.

చెప్పాలంటే దాదాపు సావిత్రి లోటు ను సౌందర్య భర్తీ చేసిందనే చెప్పాలి. తెలుగు, తమిళం, కన్నడం మరియు మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా సినిమాలలో నటించింది. దాదాపు ఈమె నటించిన సినిమాలన్ని మంచి సక్స్స్ లను అందుకున్నవే. సెలెక్టెడ్ గా సినిమాలను ఎంచుకోవడంలో చాలా మంది హీరోయిన్స్ సౌందర్య నే ఇన్స్ప్రేషన్ గా తీసుకుంటున్నారు.

ఇక సౌందర్య టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి సీనియర్ హీరోల తో పాటు అబ్బాస్, వినీత్, జె.డి.చక్రవర్తి, సాయి కుమార్ లాంటి వాళ్ళతోను నటించింది. బాలీవుడ్ లో కూడా సూర్యవంశం హిందీ రీమేక్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించారు. 2004 ఏప్రిల్ 17న హెలీకాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌రణించింది. ఈ రోజుతో ఆమె చ‌నిపోయి ప‌ద‌హారేళ్లు పుర్త‌యినప్పటికి చిత్ర పరిశ్రమలో తన లోటును ని ఎవరూ భర్తీ చేయలేకపోవటం ఆసక్తికరమైన విషయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version