బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్… ఫిర్యాదుల పటిష్ఠతకు కొత్త ఫ్రేమ్ వర్క్ !

-

న్యూఢిల్లీ : మీ బ్యాంకు మీ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదా? మీ ఖాతా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయారా? అయితే, ఇప్ప‌టి నుంచి మీకు ఇలాంటి ఇబ్బందులు ఉండ‌వు. ఎందుకంటే తాజాగా భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు (ఆర్ బీఐ) దేశంలోని బ్యాంకులు ఫిర్యాదులను వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు తాజాగా స‌రికొత్త విధానాన్ని తీసువ‌చ్చింది. బ్యాంకుల్లో ఫిర్యాదుల ప‌రిష్కార యంత్రాంగాన్ని బ‌లోపేతం చేయ‌డం కోస‌మే ఈ కొత్త ఫ్రేమ్‌వ‌ర్క్ ను రూపొందించామ‌నీ, ఉచితంగానే ఈ సేవ‌లు ల‌భిస్తాయ‌ని ఆర్‌బీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఆర్‌బీఐ ప‌రిధిలోని ఈ కొత్త‌ ఫ్రేమ్‌వ‌ర్క్ ప్ర‌కారం.. బ్యాంకుల్లో న‌మోదైన ఫిర్యాదుల‌ను వివ‌రాల‌ను వెల్ల‌డించ‌డం వంటి వివ‌రాలు స‌హా బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ కార్యాలయాలకు అందిన ఫిర్యాదుల్లో పరిశీలనార్హమైన ఫిర్యాదుల వ్యయాల రికవరీ సహా పలు అంశాలు ఈ ఫ్రేమ్‌వ‌ర్క్ లో ఉన్నాయి. బ్యాంకుల వినియోగ‌దారులు, ప్రజలకు ఈ ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ పూర్తిగా ఉచితమేనని ఆర్‌బీఐ తెలిపింది. ఈ కొత్త విధానం ద్వారా ఫిర్యాదుల ప‌రిష్కారాలు ఉచితంగా అంద‌డంతో పాటు ప‌రిష్కార స‌మ‌యం, నాణ్య‌త‌లు కూడా మెరుగుప‌డ‌తాయ‌ని ఆర్‌బీఐ పేర్కొంది. వినియోగ‌దారుల ఫిర్యాదుల పరిష్కారం నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version