మహమ్మారి వచ్చిన తర్వాత శానిటైజర్ గురించి అందరికీ తెలిసింది. శానిటైజర్ తో చేతులు కడుక్కోవడం ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ అలవాటైపోయింది. ఐతే కరోనా వైరస్ ని చంపడానికి వాడుతున్న శానిటైజర్ ని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు.
వెండి వస్తువులని పాలిష్ చేయడానికి
వెండి వస్తువులపై ఉండే చిన్నపాటి దుమ్ము పొరని దూరం చేయడానికి ఒక బట్టపై కొంత శానిటైజర్ వేసి ఆ వస్తువులని శుభ్రపరిస్తే సరిపోతుంది.
కళ్ళద్దాలు శుభ్రం చేయడానికి
కళ్ళద్దాలని శుభ్రం చేయడానికి శానిటైజర్ బాగా పనిచేస్తుంది. కళ్ళద్దాలపై ఉండే వేలిముద్రలు ఈజీగా పోవడానికి శానిటైజర్ బాగుంటుంది.
డియోడ్రెండ్ లాగా వాడండి.
డియోడ్రెండ్ లాగా కూడా శానిటైజర్ పనిచేస్తుంది. శరీరం నుండి బాక్టీరియా కారణంగా దుర్గంధం వస్తుంది. ఆ బాక్టీరియాని చంపడానికి శానిటైజర్ పనిచేసినప్పటికీ, అది మరీ మెడికల్ శానిటైజర్ కాకుండా ఉంటే మంచిది.
మొటిమలు కలగజేసే నొప్పిని నివారించడానికి
ఎదైనా పురుగు కరిచిన చోట శానిటైజర్ రాస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మొటిమల వల్ల నొప్పి కలుగుతున్నట్లయితే శానిటైజర్ అప్లై చేస్తే మంచిది.
అద్దంపై ఉండే మరకలని పోగొట్టడానికి
అందంగా తయారవడానికి అద్దం ముందు నిల్చుంటాం. ఐతే అద్దం శుభ్రంగా లేకపోతే మీరు అందంగా కనిపించరు. అద్దం మీద ఉండే అనేక వస్తువుల కారణంగా దానిమీద అనేక మరకలు పడతాయి. ఆ మరకల్ని హ్యాండ్ శానిటైజర్ ద్వారా పోగొట్టవచ్చు. శానిటైజర్ ని చిన్న బట్ట మీద పోసుకుని, దాంతో అద్దాన్ని శుభ్రపరిస్తే మరకలన్నీ మటు మాయం అవుతాయి.
ఐతే శానిటైజర్ లని వివిధ రకాల క్లీనింగ్ కోసం వాడేటపుడు అది హార్డ్ శానిటైజర్ కాకుండా ఉంటే మంచిది. కొన్ని శానిటైజర్లని ఎలా పడితే అలా వాడలేం. అందుకే ఇలా వాడాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.