వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ పోరుకు సిద్ధం అయింది. తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తు ఉద్యమ బాట పడుతుంది. నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో, మండల, జిల్లా పరిషత్ లలో, మార్కెట్ కమిటీలు, పురపాలక సంఘాలు, రైతు బంధు సమితుల్లో వరి ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మాణ పత్రాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ కు పోస్టు లేదా… కొరియర్ ల ద్వారా రాస్త్ర ప్రభుత్వం పంపించనుంది.
ఇప్పటికే ఆయా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సూచనలు వెళ్లాయి. ప్రధాని మోడీ, కేంద్రర మంత్రి పీయూష్ గోయాల్ చిరునామాలను కూడా వారికి పంపించారు. కాగ వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతుంది.
ఇటీవల రాష్ట్ర మంత్రులత కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్.. తెలంగాణ ప్రజలను నూకలు తినడం అలవాటు చేసుకోమ్మని అనడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగాది తర్వాత.. వరి ధాన్యం కొనుగోలు పై జాతీయ స్థాయిలో ఉద్యమం చేయడానికి కేసీఆర్ సిద్ధం అవుతున్నారు.