కాబుల్‌లో విమాన సర్వీసులు పునఃప్రారంభం

-

అఫ్ఘాన్‌ దేశంలో రాజ్యంగ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. అఫ్గాన్‌ విమానయాన సంస్థ అరియానా అఫ్ఘన్‌ ఎయిర్‌ లైన్స్‌ ఆగస్టు 31 న యూఎస్‌ దళాలను ఉప సంహరించుకున్న తర్వాత మొదటి సారిగా దేశీయ విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అరియానా అఫ్ఘన్‌ ఎయిర్‌ లైన్స్‌ కాబూల్‌ నుంచి హెరాట్‌, మజార్‌-ఇ-షరీఫ్‌ మరియు కాందహార్‌ నగరాలకు తన విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ ఈ విషయాన్ని తెలిపింది.

మరో స్థానిక ప్రైవేట్‌ విమానయాన సంస్థ, కామా ఎయిర్‌, ఈ అస్తవ్యస్థ పరిస్థితికి భయపడి.. తన విమానాలను కాబూల్‌ విమానాశ్రయం నుంచి ఇరానియన్‌ నగరమైన మషాద్‌ కు మార్చినట్లు సమాచారం. మీడియా సంస్థల సమాచారం ప్రకారం.. కాబూల్‌ విమానాశ్రయం లో విమానాలను తిరిగి ప్రారంభించడానికి సహాయం చేయడానికి ఖతార్‌ నుంచి ఓ సాంకేతిక బృందం అక్కడికి వెళ్లిందని అంటున్నారు. ఏదైతేనేం… మొత్తానికి కాబూల్‌ దేశీయ విమానాలు తిరిగి ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news