ఆ దేశం నుంచి వస్తే క్వారంటైన్.. జీనోమ్ సీక్వెన్సింగ్

-

సౌతాఫ్రికాలో బయటపడ్డ కొత్త వేరియంట్ ఓమ్రిన్ ప్రమాదకరమని తేలడంతో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. విదేశీయులపై ప్రత్యేక దృష్టి సారించాయి. ముఖ్యంగా సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.

సౌతాఫ్రికా నుంచి వచ్చే ముంబయి విమానాశ్రయానికి వచ్చే ప్రతి ఒక్క ప్రయాణికుడు విధిగా క్వారంటైన్‌కు వెళ్లాలని, ఎవరికైనా పాజిటివ్ అని తేలితే, వారి ఫలితాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తామని ముంబయి మేయర్ కిషోరీ పెడ్నేకర్ స్పష్టం చేశారు. సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ ఓమ్రిన్ బయట పడటంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాధారణ అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో ‘ప్రమాదకర దేశాల జాబితా’ను విడుదల చేసింది. తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.

విమానం

Read more RELATED
Recommended to you

Exit mobile version