కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.6500 కోట్ల వడ్డీలు కడుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినదంతా శుద్ద అబద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినెలా రూ.6500 కోట్ల వడ్డీ కడుతున్నదని సీఎం రేవంత్ చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని కేటీఆర్ కొట్టిపారేశారు. పోయిన నెల జనవరి వరకు అప్పులకు ప్రభుత్వం చెల్లించిన మిత్తి రూ.22 వేల 56 కోట్లు అని చెప్పారు. అంటే 10 నెలల్లో మీరు కట్టింది నెలకు రూ.2200 కోట్లు అని లెక్కలతో సహా బయటపెట్టారు. ఈ లిస్టు విడుదల చేసింది ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క గారేనని.. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి నెలకు రూ.6,500 కోట్లు మిత్తి కడుతున్నామని సిగ్గులేకుండా ఎలా చెబుతున్నాడు. ఆ డబ్బులు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు.