కేటీఆర్‌పై చర్యలకు సిద్ధమైన రేవంత్ సర్కార్?

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన్ను విచారించేందుకు గవర్నర్ కూడా అనుమతివ్వడంతో పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌తో పాటు లగచర్ల ఘటన కేసుల్లోనూ ఆయనకు నోటీసులు ఇస్తారని కథనాలు వస్తున్నాయి.

ఎల్లుండి కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని, ఆ తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటారని సమాచారం. మొన్నటివరకు గవర్నర్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. తాజాగా లైన్ క్లియర్ కావడంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముందుకు సాగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news