ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సోనియా నివాసానికి సీఎం రెడ్డి రేవంత్ వెళ్లారు. అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా ను కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ విషయం పై తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలలో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల అమలు తీరును సోనియా గాంధీకి వివరించారు. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఎలా ముందుకెళ్తున్నామన్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సోనియాకు వివరించారు.
త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలను అమలు చేయబోతున్నట్లు సోనియాకు తెలిపారు. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్య శ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు.