మోడీని ఢిల్లీలో చూసాము. కేడిని గల్లీలో చూసాము. ఇద్దరికి ఇద్దరు తోడు దొంగలే అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇద్దరూ కూడా గూడుపుఠాణి నడుపుతున్నారని మొన్న నిజామాబాదులో కేడిని బొంద పెట్టారు. ఇక మోడీ వంతు మిగిలింది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకరు కాదు ఇద్దరు తోడు దొంగల్ని తుది ముట్టిస్తేనే తెలంగాణకి న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మెదక్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మాధవి నామినేషన్ లో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ మీటింగ్ లో రేవంత్ రెడ్డి కేసీఆర్, మోడీ మీద సంచలన కామెంట్స్ ఈ విధంగా చేశారు. దుబ్బాక కి మోడీ ఇచ్చిన నిధులు ఎన్నో చెప్పగలరా అని బిజెపి నేతలు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అలానే మోడీ పాలనలో చేనేతకారుల జీవితాలు చితికిపోయాయని విమర్శించారు రేవంత్ రెడ్డి.