పొత్తులో కాకుల కథలు…రేవంత్ కాన్ఫిడెన్స్!

-

ఎప్పుడైతే కేసీఆర్…దేశ స్థాయిలో బీజేపీపై యుద్ధం స్టార్ట్ చేశారో అప్పటినుంచి..ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతారా? అనే చర్చ కూడా వస్తుంది. ఇప్పటికే కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలని కేసీఆర్ ఏకం చేసే పనిలో ఉన్నారు. విపక్ష నేతలతో వరుసగా భేటీ అవుతూ…బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే పనిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేక కూటమి అంటే కష్టమైన పని. పైగా కేసీఆర్ కలిసే వారు…ఎక్కువగా కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నవారే.

మరి అలాంటప్పుడు కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి ఉండటం కష్టం. అందుకే కాంగ్రెస్‌కు కూడా కేసీఆర్ దగ్గరయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యాకే…పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్…కాంగ్రెస్‌తో కలుస్తారని తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. తమతో విభేదించిన కేసీఆర్….రేపు తమతో కలిసి రావచ్చని మాట్లాడారు. దీంతో కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ప్రచారం మొదలైంది.

ఇదే క్రమంలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…పొత్తు అంశంపై స్పందించారు. ఆ ఇంటి మీద కాకి…ఈ ఇంటిపై వాలదని మాట్లాడారు. ఒకవేళ వాలితే చచ్చిందే అని అన్నారు. కలలో కూడా కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తు సాధ్య కాదని తేల్చి చెప్పారు. కేసీఆర్ పాలనపై యుద్ధం చేసి తీరుతాం గాని…కేసీఆర్ పాపాలని మోసేందుకు రెడీగా లేమని చెప్పారు.

అయితే రేవంత్ పొత్తు ఉండదని కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు…కానీ కేంద్ర స్థాయిలో పొత్తు గురించి చర్చలు జరిగి…చివరికి పొత్తు సెట్ అయితే రేవంత్ పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న కొన్ని పార్టీలు…కేసీఆర్‌ని సైతం దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఈ అం

Read more RELATED
Recommended to you

Exit mobile version