బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం బీఆర్ఎస్ భవన్ వేదికగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మోడీ డైరెక్షన్ లో రేవంత్ పనిచేస్తున్నారు. ప్రతీ విషయంలో బీజేపీతో రేవంత్ కలిసి పనిచేస్తున్నారు. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్,కేటీఆర్‌లపై కేసులు పెడుతామని రేవంత్ అంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉంది కాబట్టే మేము వాస్తవాలు బయటపెట్టగానే బీజేపీ నాయకులు మమ్మల్నే విమర్శిస్తున్నారు’అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాము మాట్లాడే ప్రతిదానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, కేంద్రమంత్రి బండి సంజయ్ మాత్రమే కౌంటర్ ఇస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో గులాబీ పార్టీని ఎదగనీయొద్దని కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు.