కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ రెడ్డి

-

రాహుల్ గాంధీ జొడో యాత్ర తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగించారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉదయించే సురుడిగా… తెలంగాణ లోకి ఎంటర్ అయ్యారు రాహుల్ గాంధీ అని ఆయన అన్నారు. చరిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం ఘనంగా స్వాగతం పలికిందని, అపనమ్మకంతో ఉన్న సమాజానికి భరోసా కలిగించారు రాహుల్ గాంధీ అని ఆయన వ్యాఖ్యానించారు. జోడో యాత్రలో నా బాధ్యత సంపూర్ణంగా నిర్వహించా అనుకుంటున్నా. జోడో యాత్ర స్పూర్తితో జనంలోకి వెళతాం. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. మునుగోడు ఉప ఎన్నికల్లో మేము గెలిచాం అని సంబరాలు చేసుకుంటున్నారు. కానీ స్వతహాగా తను గెలవలెను అని ఒప్పుకున్నారు. కమ్యూనిస్టుల శరణు జోచ్చి గెలిచారు. కమ్యూనిస్టులు లేరని చెప్పిన ఆయన ఇప్పుడు వాళ్లే దిక్కు అయ్యారు. కేసీఆర్.. ఇప్పుడు పరన్నా జీవి అయ్యాడు. ఎన్నికల సంగం అవసరం లేదు.

ఉన్నా దాని వల్ల ఉపయోగం లేదని మునుగోడు ఎన్నికలు నిరూపించాయి. మాయా పాచికలో పాండవులు ఓడిపోయినప్పుడు కౌరవులు సంతోష పడ్డారు. కానీ కురుకేత్రం లో విజయం సాధించించారు. మునుగోడు ఎన్నికలతో టీఆర్‌ఎస్‌.. బీజేపీ ఓటమికి పునాది పడ్డాయి. మాకు ఓట్లు రాలేదని నిరాశ ఉన్నా. కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడ్డారు. మా శ్రేణుల కృషి అభినందనీయం. మా పోరాట పటిమ లో లోపం లేదు. వెంకట్ రెడ్డి ఏఐసీసీ సభ్యుడు. ఇది పీసీసీ పరిధి కాదు. ఏఐసీసీ చూసుకుంటుంది. జనతా బార్ లో ఒకటి వేసిన తర్వాత ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. రాష్ట్రంలో పంచాయతీ కూడా అట్లనే ఉంది. గవర్నర్ ఏదైనా అనుమానం ఆడిగితే నివృత్రి చేయాలి. అది లేకుండా చిల్లర పంచాయతీ కి ప్రభుత్వం తెర లేపుతుంది. గవర్నర్ అనుమానం పై సమాధానం చెప్తే ఐపోయే. గవర్నర్ కూడా ప్రతిదీ రాజకీయ కోణం లో చూడొద్దు.

 

బీజేపీ నాయకుల బాధ్యత గవర్నర్ నిర్వహించాలని అనుకోవడం సమంజసం కాదు. బండి సంజయ్ పాత్ర పోషించాలని ఆనుకుంటున్నారు..మంచిది కాదు. ఫోన్ ట్యాపింగ్ బీజేపీ చేస్తుంది. టీఆర్‌ఎస్‌ చేస్తుంది. బీజేపీ.. టీఆర్‌ఎస్‌ ది మిత్ర భేదం. బీజేపీ.. టీఆర్‌ఎస్‌ ది… విక్రమార్కుడు సినిమాలో రవితేజ.. బ్రహ్మానందం పాత్ర లెక్క. అందరికి గుండు కొట్టి పంపకాల పంచాయతీ పెట్టినట్టు…బీజేపీ.. టీఆర్‌ఎస్‌ పంచాయతీ. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఇచ్చింది ఎవరు. దీనిపై బీజేపీ.. టీఆర్‌ఎస్‌ లొల్లి ఏంది.’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version